గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (06:20 IST)

మెగాస్టార్ తల్చుకుంటే దక్కిన అవకాశాలూ హుళక్కేనా?

అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయో చిత్రసీమలో ప్రతి హీరోయిన్‌కు అనుభవమే. స్టార్ హీరోల అహాలకు బలయ్యే వారు కొందరైతే, తమ సొంత అహాలకు బలయ్యేవారు మరి కొందరు. పాపం.. కేథరీన్ తెస్రాకు ఈ అనుభవం కాస్త లేటుగా ఎదురైనట్లుంది.

తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు చాన్స్ రావాలంటే, అదీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావాలంటే ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయో చిత్రసీమలో ప్రతి హీరోయిన్‌కు అనుభవమే. స్టార్ హీరోల అహాలకు బలయ్యే వారు కొందరైతే, తమ సొంత అహాలకు బలయ్యేవారు మరి కొందరు. పాపం.. కేథరీన్ తెస్రాకు ఈ అనుభవం కాస్త లేటుగా ఎదురైనట్లుంది.
 
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి సినిమాలతో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సరైనోడు సినిమా తరువాత అందరితో ముద్దుగా ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్న ఈ భామకు చిరంజీవి 150వ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత చిరంజీవి చేసిన ఆ సినిమాలో  కనీసం ఒక్క ఫ్రేములో అయినా.. కనిపించాలని చాలా మంది తారలు ప్రయత్నించారు. అటువంటి అరుదైన అవకాశం బన్నీ కారణంగా కేథరిన్‌కు దక్కింది. కానీ ఈమెకు ఉన్న ఈగో కారణంగా ఆ అవకాశం కాస్త లక్ష్మీ రాయ్ తన్నుకుపోయింది.
 
అయితే డాన్స్ మాస్టర్ లారెన్స్‌తో షూటింగ్ సమయంలో వచ్చిన విభేదాల కారణంగానే ఆమెను తప్పించారని కొందరు చెబుతుంటే.. చిరంజీవి కూతురు సుస్మితను ఎదిరించిన కారణంగానే తప్పించారని మరికొందరు చెబుతున్నారు. అంటే స్టార్ హీరోల అహాలకు ఇలా సాంకేతిక నిపుణుల అహాలు, స్టార్ హీరోల కూతుళ్ల అహాలు కూడా తోడై అంత గ్లామరస్ నటీమణులు కూడా స్థానం కోల్పోయి వెకేట్ చేయాల్సిందేనన్నమాట.  కారణం ఏదైనా కావచ్చు .. ఓ ప్రముఖ సినిమా నుండి ఆమెను తప్పించడానికి ఆమె ప్రవర్తనే అని కారణం  తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. 
 
చిరంజీవి సినిమా నుండే బయటకు వచ్చిందంటే ఆమెది మామూలు ఆటిట్యూడ్ కాదని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం అగ్రహీరోల వారి కుటుంబాల అహాలకు ఎంత గొప్పవారయినా మటాష్ కావలిందేనా అని నిరసన తెలుపుతున్నారు. ఏదేమైనా ఒకే ఒక పాట కేథరిన్ తెస్రా కెరీర్‌కే ప్రమాదం తెచ్చిపెట్టింది.
 
సరైనోడు చిత్రంలో యంగ్ ఎమ్మెల్యేగా అదరగొట్టిన గ్లామర్ కూడా స్టార్ హీరో అహం బారిన పడి వెలవెలపోయింది మరి.