గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (17:39 IST)

అజయ్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్‌ గా చక్రవ్యూహం

ajya and dir explain seane
ajya and dir explain seane
అజయ్  ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం "చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక..చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.
 
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మధు సుధన్ మాట్లాడుతూ.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మా "చక్రవ్యూహం" చిత్ర  ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఆయన విడుదల చేసిన  ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది.ఇందులో నటించిన  నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.
 
విరూపాక్ష సినిమాలో తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్న అజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు. 1:05 నిడివి ఉన్న ఈ టీజర్ మొదటినుండి చివరివరకు ఆసక్తికరంగా ఉంది. అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ  "చక్రవ్యూహం" చిత్రాన్ని జూన్ 2 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర బృందం.