శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (18:15 IST)

ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ చండిక : చిత్ర యూనిట్

Sriharsha, Nisha
Sriharsha, Nisha
"ప్రతీ ఆత్మకు ఒక కధ ఉంటుంది. అలాగే చండికకి కూడా ఓ కధ వుంది. కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కధ. దానిని కద  అని చెప్పడం కంటే  తన వ్యధ అని చెప్పొచ్చు. ఆ కధ ఏంటి? తన తాపత్రయం ఏంటి?  ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటోంది. అన్న అంశాన్ని "చండిక" చిత్రంలో  చూపించబోతున్నాం" అని దర్శకుడు తోట చిత్ర యూనిట్ కృష్ణ.చెప్పుకొచ్చారు.
 
Chandika team
Chandika team
వీర్, శ్రీహర్ష, నిషా, ఖుషి ప్రధాన పాత్రలలో   కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మించిన  ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. .ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ చిత్రం నాలుగు ట్రైలర్లను ఆవిష్కరించారు. అతిధులుగా పాల్గొన్న  తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్..దామోదర్ ప్రసాద్, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.బసిరెడ్డి, నిర్మాతలు సాయివెంకట్, మోహన్ గౌడ్, గురురాజ్ ఒక్కొక్కరు ఒక్కో ట్రైలర్ ను విడుదల చేశారు.
 
అనంతరం అతిధులంతా మాట్లాడుతూ,  "అభిరుచి కలిగిన నిర్మాత, పరిశ్రమలో నలభై సంవత్సరాల అనుభవం కలిగిన దర్శకుడు తోట కృష్ణ కలయికలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది  ట్రైలర్స్ నేటి హారర్ ట్రెండ్ కు తగ్గట్టుగా విభిన్నంగా ఉన్నాయి" అని అన్నారు
 
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, "హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.  ఇందులో ఆత్మ ప్రతీకారం తీర్చుకునే అంశం చాలా కొత్తగా ఉంటుంది. పాత్రధారులంతా తమపాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. పలు చిత్రాలను తీసిన నిర్మాత గురురాజ్ ఇందులో  ఓ కీలక పాత్రను పోషించారు." అని అన్నారు.
 
చిత్ర నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ " ఈ చిత్రానికి నేనే కథను అందించాను. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.  
 
ఈ చిత్రానికి రచన: దాసరి వెంకటేష్, మాటలు:: తోటపల్లి సాయినాధ్, సినిమాటోగ్రఫీ: నగేష్, సంగీతం: చేతన్ విన్,  ఎడిటింగ్: మన శ్రీను నిర్మాత కె.వి.పాపారావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తోట కృష్ణ