గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (14:45 IST)

కరణ్ విత్ కాఫీ.. రణ్‌వీర్‌తో కమిటయ్యాక ఇతరులను చూడటం..?

Ranveer_Deepika
Ranveer_Deepika
బిటౌన్ టాప్ కపుల్ దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నారు. ఈ జంట 2018లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. తాజాగా కరణ్ విత్ కాఫీలో ఈ జోడీ పాల్గొంది. ఈ సందర్భంగా దీపికా తన గత సంబంధాలను రణవీర్‌తో ఆమె ప్రేమ గురించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 
కారణం ఆ మాటలు రణవీర్- కరణ్ జోహార్ ఇద్దరినీ షాక్‌కి గురి చేశాయి. రణ్‌వీర్‌కి ముందు తాను రెండు సంబంధాలు పెట్టుకున్నానని, వారిద్దరూ తన బాధను విడిచిపెట్టారని దీపికా పదుకొనే చెప్పింది. ఎప్పటికీ ఒంటరిగా ఉంటూ సరదాగా గడపాలని కోరుకున్నప్పుడు, తాను రణవీర్‌ని కలిశానని తెలిపింది.
 
అతనితో ఉన్న స్వేచ్ఛను ఇష్టపడిన తర్వాత, తాను రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడానికి అంగీకరించానని చెప్పింది. రణ్‌వీర్‌, దీపికా పదుకొణె పలు విషయాలపై మాట్లాడుకున్నారు. తమ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో రణవీర్ సింగ్ వెల్లడించారు.
 
తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా దాదాపు ఐదేళ్ల తర్వాత తమ పెళ్లి వీడియోను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 
'మనసు'లో రణ్‌వీర్‌తో కమిట్‌గా ఉన్నప్పుడు 'ఇతరులను చూడటం'పై అని దీపికా పదుకొనే అంగీకరించిన ఈ మాటలు అంతటా మిశ్రమ స్పందనలను పొందాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.