గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (19:30 IST)

ఎవరూ లేని సమయంలో శ్రీలీల మామయ్యా అని పిలుస్తుందట..!?

Sreeleela
యంగ్ హీరోయిన్ శ్రీలీల దర్శకుడు అనిల్ రావిపూడికి శ్రీలీల దగ్గర బంధువు. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ... శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు. సెట్స్‌లో అనిల్‌ను డైరెక్టర్‌గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట.
 
శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పంగులూరు అని అనిల్ తెలిపారు. తన అమ్మమ్మది కూడా అదే ఊరని, శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందన్నారు. అయితే బెంగళూరు, అమెరికాలో చదువుకుందని అనిల్ రావిపూడి తెలిపారు.