సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (17:30 IST)

భగవంత్ కేసరి చాలా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా అవుతుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

Director Anil Ravipudi
Director Anil Ravipudi
ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని మొదట అనుకున్నాం. అయితే బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ వుండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు వుంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు వునప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్ బికే గా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది-అని అనిల్ రావిపూడి అన్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు.  భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

‘భగవంత్ కేసరి' మీ మార్క్ కి భిన్నంగా కనిపిస్తోంది.. దీనికి స్ఫూర్తి ఏమిటి ?
నేను ఆరు సినిమాలు పూర్తి చేశాను. అంటే.. ఒక ఓవర్ అయిపొయింది. ఇది మరో ఓవర్, మరో ఇన్నింగ్ అనుకుంటున్నాను. ఎమోషనల్ డ్రామా సీన్స్ ముందు సినిమాల్లో కూడా బాగా చేశాను. అయితే ఎంటర్ టైన్ మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అవి నెక్స్ట్ లెవల్ కి చేయలేదనే ఫీలింగ్ వుంది. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించింది. దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. మంచి స్టార్ కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ‘భగవంత్ కేసరి' చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనుకుంటున్నాను.  

సరిలేరు నీకెవ్వరు లో ఆర్మీ నేపథ్యం వుంది.. ఇందులో కూడా ఆర్మీ కనెక్ట్ వుంది కదా ?
‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేశాం. ‘భగవంత్ కేసరి' లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా వుంటుంది. అమ్మాయి కి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం. 'అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి'  అనే అండర్ లైన్ బ్యూటీఫుల్ కంటెంట్ వుంది. ఇప్పుడు అమ్మాయిలు ఆర్మీలో చేరుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్  విభాగాల్లో పని చేస్తున్నారు. భవిష్యత్ లో వార్ లో భాగమౌతారు. అమ్మాయిలు ఆర్మీకి సిద్ధమౌతున్న డాక్యుమెంటరీలు కూడా చూశాను. ఎవరూ టచ్ చేయని పాయింట్, కొంచెం స్ఫూర్తిని ఇచ్చేలా కూడా  వుంటుంది. నేను అనుకున్న కథకి ఈ నేపధ్యం ఇంకా ఉంటుందనిపించి చేయడం జరిగింది.  

‘భగవంత్ కేసరి' కథ, పాత్ర బాలకృష్ణ గారికి చెప్పినపుడు ఎలా ఎక్సయిట్ అయ్యారు ?
బాలకృష్ణ గారు కొత్త ఎలిమెంట్ వున్న కథని యాక్సప్ట్ చేస్తారు. ఒక మంచి కథ చెప్పాలి, ప్రయోగం చేయాలని అనుకుంటే ఆయన ముందు వుంటారు. ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించారు. 'అమ్మాయిని ఒక  సింహంలా   పెంచాలి' ఈ కాన్సెప్ట్ ఆయన చాలా బాగా నచ్చింది. చాలా బలంగా నమ్మారు. ఒక స్టార్ హీరోగా వుండి శ్రీలీల లాంటి అప్ కమింగ్, ఫుల్ ఫాం లో వున్న హీరోయిన్ కు ఫాదర్ గా చేయడానికి ఒప్పుకోవడం.. ఆయన గట్స్ నిజంగా హ్యాట్సాఫ్. ఆయన కథని బలంగా నమ్మారు. నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చారు. ఓ నటుడిగా షూటింగ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ ,కంఫర్ట్ .. అవుట్ పుట్ చూస్తే మీకు అర్ధమౌతుంది.

తెలంగాణ యాస చెప్పించాలనే ఆలోచన మీదేనా ?
అవును. తెలంగాణ యాసలో ఒక ముక్కుసూటి తనం వుంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా వుంటుంది. ఇది ఆయన మీద చేస్తే బాగా వర్క్ అవుట్ అవుతుందని బలంగా నమ్మాను, అది బాగా వర్క్ అవుట్ అయ్యింది కూడా. ఇందులో చాలా డైలాగ్స్ ఆయన నేచర్ కి దగ్గరగా వుంటాయి. డైలాగ్స్ థియేటర్స్ లో పేలుతాయి.

మీ సినిమాల్లో పాత్రలు కొంచెం లౌడ్ గా వుంటాయి కదా ,. ఇందులో ఎలా వుంటుంది ?
భగవంత్ కేసరి లో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా వుంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా సహజంగా చేశాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలా రియలిస్టిక్ గా చేశాం.  అలాగే నా మార్క్ ఫన్ టింజ్ సినిమాలో అక్కడక్కడ టచ్ అవుతూనే వుంటుంది. సహజంగా ప్రయత్నిస్తూనే వినోదాన్ని రాబట్టాం. ఇందులో కూడా చాలా మంచి వన్ లైనర్స్ వున్నాయి. ట్రైలర్ లో బ్రో ఐ డోంట్ కేర్, హుష్ సప్పుడు జేయక్ .. తో పాటు ఇంకొన్ని క్యాచి లైనర్స్ వున్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఇంకా పాపులర్ అవుతాయి.

బాలకృష్ణ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు ?
నన్ను బ్రో అని పిలుస్తారు, ఐతే షూటింగ్ స్పాట్ లో గురువు గారు అని పిలుస్తారు. అంత పెద్ద లెజెండరీ యాక్టర్  గురువు గారు అని పిలవడంతో చాలా షాక్ అయ్యాను. దర్శకుడి స్థానానికి ఆయన ఇచ్చే గౌరవం అది. ఇక ఫన్ మోడ్ లో వుంటే ఆయన్ని ఆపలేం... అన్ స్టాపబుల్.

బాలకృష్ణ గారు ఇందులో రెండు క్యారెక్టర్స్ లో కనిపిస్తారా ?
లేదండీ. ఒకటే పాత్ర. ఐతే క్యారెక్టర్ లో వేరియేషన్ వుంటాయి. ముందు జైలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆరంభం నుంచి భగవంత్ కేసరి పాత్ర ఒక పాపతో జర్నీ చేసి, ఆ పాపని లక్ష్యం వైపు ఎలా తీసుకెళ్ళారు ? అదే సమయంలో తనకి వున్న పగని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ? అనేది కథ.

అర్జున్ రామ్ పాల్ పాత్ర గురించి ?
ఇందులో విలన్ ది చాలా పెద్ద రోల్. బాలకృష్ణ గారికి ఎదురుగా నిలబడే పాత్ర. అర్జున్ రాం పాల్ గారిని ఓ శాంతి ఓం లో చూసిననప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బావుటుంది. తెలుగులోకి తీసుకొస్తే బావుటుందని ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆయన ముందే భాష విషయంలో ఒక నిర్ణయంతో వున్నారు. ప్రామ్టింగ్ చేయను నేర్చుకొని చెప్తా అన్నారు. ముందే డైలాగ్స్ ఇవ్వమని చెప్పారు. ప్రతి డైలాగుని బట్టిపట్టారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు.  

అర్జున్ రామ్ పాల్ లాంటి నటుడు తో  స్టిక్ పట్టించడానికి కారణం ?
అది మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా సర్ప్రైజ్ వుంది. క్లైమాక్స్ లో తెలుస్తుంది.

మీ తర్వాత సినిమాలో కూడా తమన్ ని కంటిన్యూ చేస్తారా ?
సాయి కార్తిక్ తో మూడు, దేవి గారితో మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు తమన్ కూడా జర్నీ చాలా బావుంది. ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. తనతో జర్నీ కొనసాగించాలనే భావిస్తాను. ఇందులో మొత్తం మూడు పాటలు వుంటాయి. మూడు కూడా సిట్యువేషనల్ సాంగ్స్. మరో సాంగ్ తీసి పక్కన పెట్టాం. అది దసరాకి యాడ్ చేస్తాం.

ఇందులో వెపన్ చాలా కొత్తగా వుంది కదా ?
ఈ సినిమాలో బాలకృష్ణ గారు వెపన్ ని క్యారీ చేయరు. అక్కడున్న పరిస్థితులు, లొకేషన్ నుంచి ఒక వెపన్ ని తీసుకుంటారు. అది చాలా కొత్తగా ఆసక్తిగా వుంటుంది. ప్రతి సీన్ లో ఆయన ఒక వెపన్ అందుకుంటాడు. అది ఎలా అందుకుంటారో చాలా ఇంట్రస్టింగా వుంటుంది. ఇందులో ప్రతి సీక్వెన్స్ కి ఒక వెపన్ వుంటుంది. అది చాలా నేచురల్ గా వుంటుంది.

ఇందులో మొత్తం ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయని విన్నాం?
లేదండీ. మొత్తం మూడు ఫైట్లే. ఓపెనింగ్ ,ఇంటర్వెల్ క్లైమాక్స్. ఐతే మిగతావన్నీ ఫైట్స్ లా కనిపిస్తాయి కానీ ఫైట్స్ కాదు. అవన్నీ యాక్షన్ బ్లాక్స్. దాని నుంచి కూడా యాక్షన్ వినోదం పుడుతుంది.  

శ్రీలీల ని చాలా కష్టపెట్టించినట్లుగా వున్నారు.. ఫైట్స్ కూడా చేయించారా ?
దీని గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే విడుదలైన తర్వాత మాట్లాడాలి. అదంతా తెరపై చూడాల్సిందే.
 శ్రీలీల బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. తనకి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, డ్యాన్సుల ఇరగదీస్తుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య ఎమోషన్ ఇంటెన్స్ డ్రామా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది. శ్రీలీలకి ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది.  

కాజల్ గారి పాత్ర ఎలా వుంటుంది ?
బాలకృష్ణ గారు కాజల్ మధ్య ఎలాంటి వినోదం వుటుంది ఒక గ్లింప్స్ రిలీజ్ చేశాం. కాజల్ ది చాలా కీలకమైన పాత్ర. రెగ్యులర్ హీరోయిన్ తరహా కాదు, కథకు కనెక్ట్ అయి వుంటుంది.

దీనికి పార్ట్ 2 చేసే ఆలోచన ఉందా ?
ఇప్పటివరకూ ఆలోచన లేదు. సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాని బట్టి పార్ట్ 2 గురించి ఆలోచిస్తాం.  

ఇకపై యాక్షన్ సినిమాలు తీస్తారా ?
ఒక దర్శకుడిగా అన్ని సినిమాలు చేయాలని నా కోరిక. కె విశ్వనాథ్ గారు లాంటి సినిమా చేయాలని వుంటుంది. అలాగే కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని వుంది. ఈ జర్నీలో ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ ప్రకారం డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేస్తూ వెళ్ళాలనేది నా ప్రయత్నం.

షైన్ స్క్రీన్స్ నిర్మాతలు గురించి ?
హరీష్, సాహు 2016 లో పరిచయం అయ్యారు. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చారు. దాదాపు ఐదేళ్ళు వెయిట్ చేశారు. సరైన సమయంలో సరైన ప్రాజెక్ట్ వచ్చిందనే చెప్పాలి. దిల్ రాజు గారు, శిరీష్ గారి తర్వాత అంత చనువు వున్న నిర్మాతలు. మున్ముందు వారితో సినిమాలు చేయాలని వుంది.

ఒక ఆడియన్ గా  భగవంత్ కేసరి గురించి ఏం చెప్తారు ?
కొత్త సినిమా. మంచి సినిమా. సినిమా చూసిన పది నిమిషాల తర్వాత ఇది వేరే ప్రపంచం అని ప్రేక్షకులకు అర్ధమైపోతుంది. బాలకృష్ణ గారి ముందు సినిమాల రిఫరెన్స్ లు ఇందులో వుండవు. నేచురల్ గా వెళుతుంది. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ గారిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి భగవంత్ కేసరి నచ్చుతుంది. మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా నచ్చుతుంది.  

కొత్త సినిమాల గురించి?
ప్రస్తుతం నా దృష్టి మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే వుంది. విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ఐతే ఏది చేసినా డిఫరెంట్ గా ఛాలెంజింగ్ గా చేయాలని వుంది.