1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 2 జూన్ 2016 (10:28 IST)

చిరు - నాగ్‌ - అల్లులతో సెల్ఫీ దిగిన సచిన్.. సోషల్ మీడియాలో హైలెట్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున, అగ్రనిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అందరూ ఒకేచోట చేరితే ఇంకేమన్నాఉందా అభిమానులకు కనులపండుగే. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ సెలబ్రిటీలు పసుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఒక సెలబ్రిటి తన సెల్ఫీ తీసుకొంటేనే జనాలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు. అలాంటిది ఒకేసారి నలుగురు సెలబ్రిటిలు కలిసి సెల్ఫీ దిగితే అది మహాద్భుతం. ఈ అరుదైన సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ స్థాపించిన కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)లో చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా చేరిన విషయం తెలిసిందే.