సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:23 IST)

భర్త ఆర్నావ్‌తో నాకు నా బిడ్డకు హాని.. నటి దివ్యా శ్రీధర్

Divya
Divya
కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ వార్తల్లో నిలిచింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని వుందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 
వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య. సీరియల్‌లో తనతో పాటు నటించిన ఆర్నావ్‌తో ప్రేమలో పడింది. కొన్నేరోజులు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు.
 
అయితే ఆర్నావ్ కొన్ని నెలలు బాగానే ఉన్నా ఆ తరువాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం దివ్యకు తెలియడంతో అందరి ముందు భర్తను నిలదీసి తమ పెళ్లిని లీగల్ చేస్తూ గుడిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆర్నావ్‌లో మార్పు రాలేదు. 
 
మరో నటితో రాసలీలలు చేస్తూ దివ్య కంటపడ్డాడు. దీంతో ఆమె మరోసారి అతడిని నిలదీయడంతో అతడు ఎదురుతిరిగాడు. ఆమెను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసుల సాయం కోరింది.
 
తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవాలనిచూస్తున్నాడని, అతని వలన తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. 
 
ఇక దివ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దివ్య అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.