శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (14:48 IST)

చిరంజీవి బర్త్ డే.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ- రౌడీ హీరో వీడియో

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిరు తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. 
 
"నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తిని కోరుకుంటున్నాను" అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. చిరుకు బర్త్ డే విషెస్ చెప్పాలని అందరినీ కోరారు. "మనసున్న మారాజు అన్నయ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. చిరుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషెస్ చెప్పాడు.