గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (13:10 IST)

#RallyForRivers : 'నదులు ఇంకిపోతున్నాయి... కాపాడుకుందాం రండి' : చిరంజీవి

దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస

దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణ పౌరుల నుంచి సెలెబ్రిటీల వరకు ర్యాలీ ఫర్ రివర్స్‌‍కు మద్దతిస్తున్నారు. ఇందులోభాగంగా ర్యాలీ ఫర్ రివర్స్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. ఇందుకోసం ఆయన 80009 80009 అనే నంబరుకు ఆయన మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోందని.. నదులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది" అని అన్నారు. ‘నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయి, నదులు ఇంకిపోతున్నాయి.. ఎండిపోతున్నాయి, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిది’ అని అన్నారు. నదులను కాపాడేందుకు ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమానికి మద్దతివ్వాలని ఈ సందర్భంగా చిరంజీవి కోరారు. భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని చిరంజీవి అన్నారు.