సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:29 IST)

చిరు సైరా ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా నర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న ఈ సంచ‌ల‌న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీల‌క‌ పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యానర్ పైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం కేర‌ళ‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
కేరళలోని దట్టమైన అడవుల్లో చిరంజీవి త‌దిత‌రులపై భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచేలా ఉంటాయ‌ట‌. 10 రోజుల పాటు అక్కడ పోరాట సన్నివేశాలనే చిత్రీకరిస్తారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ షూటింగు జరగనుంది. దీంతో ఈ సినిమా షూటింగు పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ త‌ర్వాత విఎఫ్ఎక్స్ స్టార్ట్ చేస్తారు. దీనికి టైమ్ కాస్త ఎక్కువ ప‌డుతుంది. అందుచేత ద‌స‌రా కానుక‌గా సైరాని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.