సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (14:30 IST)

షణ్ముఖ్ జశ్వంత్.. అబ్బ నీ తియ్యని దెబ్బతో వచ్చేస్తున్నాడు.. (వీడియో వైరల్)

సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం యువతపై బాగానే వుంది. టిక్ టాక్, యూట్యూబ్‌ల్లో తమకు తామే కొత్త కాన్సెప్టులతో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన వారిలో ముందేందే పేరు షణ్ముఖ్ జష్వంత్. షణ్ముఖ్ ఎప్పుడు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో పాటు కొత్త కొత్త పాటలతో యూట్యూబ్‌లో ముందుంటాడు. తాజాగా షణ్ముఖ్ మెగాస్టార్ చిరంజీవిపై పడ్డాడు. 
 
చిరంజీవిగారి ''జగదేక వీరుడు అతిలోక సుందరి''లోని ఎవర్ గ్రీన్ అబ్బని తీయని దెబ్బ పాటతో ఈ ఆదివారం నెటిజన్ల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. తనను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. 
 
ఇంకా వారికి రుణపడి వుంటానని చెప్పుకొచ్చాడు. తాజాగా తాను చేయబోయే మెగాస్టార్ పాటను కూడా ఎప్పటిలాగే ఆదరించి, తనను ఆశీర్వదించాలని షణ్ముఖ్ కోరాడు. తాజాగా షణ్ముఖ్ తీసిన ''మెన్ విల్ బి మెన్ బట్ రెస్పెక్ట్ వుమెన్'' వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.