సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:22 IST)

సంగీత ప్రియులకు శుభవార్త.. ఏంటది?

యాప్‌ల ద్వారా సంగీతాన్ని ఆస్వాదించే సంగీత ప్రియులకు శుభవార్త. ఇండియాలో కొద్దిరోజుల క్రితమే స్పాటిఫై రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో శుభవార్త మన చెవిలో పడింది. ఇండియాలోకి గూగుల్ నుండి మరో మ్యూజిక్ యాప్ వచ్చింది. ఇప్పటికే గూగుల్ నుండి గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే మూవీస్ ఉన్నాయి. 
 
తాజాగా మరో రెండు యాప్‌లను గూగుల్ రిలీజ్ చేసింది. అవి యూట్యూబ్ మ్యూజిక్ యాప్, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంలు. యూట్యూబ్ మ్యూజిక్‌ని ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు కాకపోతే దానిలో ప్రకటనలు వస్తాయి. మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంని ఉపయోగించినట్లయితే యాడ్స్ రావు. ప్రీమియం ధరలు విదేశాలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నాయి. 
 
ప్రమోషన్‌లో భాగంగా దీనిని మూడు నెలలపాటు ఉచితంగా ఉపయోగించే అవకాశం కల్పించింది గూగుల్. మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్10ని కొనుగోలు చేసినట్లయితే యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా గూగుల్ ప్లే మ్యూజిక్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరంలేదు. నాలుగు నెలలపాటు యూట్యూబ్ ప్రీమియంని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్ నెలకు రూ.99 అదే విధంగా ఐఓఎస్ వినియోగదారులకు నెలకు రూ.129 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.