శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (11:02 IST)

సుస్మిత బర్త్‌డే పార్టీలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు

ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ సంద‌డికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు

ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ సంద‌డికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఒక్క హీరో పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామీలీ హీరోలంతా హాజరయ్యారు. 
 
వీరంద‌రు సుస్మిత‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సంద‌డి చేశారు. ఆ త‌ర్వాత సెల్ఫీకి కూడా ఫోజులిచ్చారు. ఈ ఫోటోనే ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోల్లో చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, నిహారిక‌, క‌ళ్యాణ్ తేజ్ ఇలా ప‌లువురు స్టార్స్ వెండితెర‌పై మెరిసి అల‌రిస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీలో ఏదైన వేడుక జ‌రిగిందంటే ఆ హంగామానే వేరుగా ఉంటుందని మరోమారు నిరూపితమైంది. 
 
కాగా, సుస్మిత త‌న తండ్రి న‌టించిన "ఖైదీ నెం.150" చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. అలాగే, చిరు 151వ చిత్రం "సైరా"కి సంబంధించిన‌ కాస్ట్యూమ్ వ‌ర్క్‌లో సుస్మిత పాలుపంచుకుంటోంది.