సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (18:06 IST)

"సైరా" డిజిటల్ రైట్స్ రూ.30 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఏ.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.30 కోట్లు చెల్లించి సొ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఏ.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.30 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంటుంది. 
 
ఈ చిత్రం ఫస్ట్‌లుక్ నుంచి టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు... సినిమాకు సంబంధించి డిజిటల్ మీడియా మాధ్యమంగా సాగే అన్ని కార్యక్రమాల హక్కులూ అమెజాన్‍కు దక్కాయని తెలుస్తుండగా, ఆ సంస్థ ఇంత భారీ మొత్తం ఇచ్చి ఓ సినిమాను కొనడం ఇదే తొలిసారని సమాచారం. 
 
ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ 'సైరా'లో భాగస్వామ్యం అయిందని భారీ మొత్తాన్ని ఇచ్చిందని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'వన్ అండ్ ఓన్లీ చిరంజీవి', 'మెగాస్టారా మజాకా', 'చిరంజీవికే అంతటి సత్తా ఉంది' అని కామెంట్స్ పెడుతున్నారు.