శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:37 IST)

శ్రీదేవిని చివరిసారి చూడాలనీ.. క్యూ కట్టిన బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్

ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ముంబైకు క్యూకట్టారు. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం శ్రీదేవి భౌతికకాయం ఉన్న సెలబ్రిటీ సెలెబ్రేషన్

ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ముంబైకు క్యూకట్టారు. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం శ్రీదేవి భౌతికకాయం ఉన్న సెలబ్రిటీ సెలెబ్రేషన్ క్లబ్‌కు వచ్చి తమ అభిమాన నటిని కడసారి చూసి అంజలి ఘటిస్తున్నారు. 
 
ఇకపోతే, తాను ఎంతో అభిమానించే శ్రీదేవిని కడసారి చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ముంబైకు చేరుకున్నారు. ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయిన చిరంజీవి అక్కడి నుంచి నేరుగా సెలెబ్రేషన్స్ క్లబ్‌కు బయల్దేరారు. 
 
ఆయనతో పాటు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, రానాలతో పాటు.. బాలీవుడ్ ప్రముఖులంతా క్లబ్‌కు చేరుకున్నారు. కాగా, మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర జరుగనుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.