శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (08:50 IST)

నటి శ్రీదేవికి శవపరీక్ష చేసిన వ్యక్తి ఏ దేశస్తుడో తెలుసా?

ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు తొట్టిలోపడి మృత్యువతాపడ్డారు. ఆ తర్వాత వివిధ రకాల సందేహాలు, అనుమానాలు, విచారణల తర్వాత మంగళవారం రాత్రి మృతదేహాన్ని ముంబ

ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు తొట్టిలోపడి మృత్యువతాపడ్డారు. ఆ తర్వాత వివిధ రకాల సందేహాలు, అనుమానాలు, విచారణల తర్వాత మంగళవారం రాత్రి మృతదేహాన్ని ముంబైకు తీసుకొచ్చారు. అయితే, శ్రీదేవి భౌతికకాయానికి శవపరీక్షలు చేసిన తర్వాతే మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు దుబాయ్ పోలీసులు అప్పగించారు. కానీ, ఈ శవ పరీక్ష చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఓ భారతీయుడు.. అదీ కూడా దక్షిణాది రాష్ట్రమైన కేరళకు చెందిన వ్యక్తి. పేరు అష్రఫ్. బతుకుదెరువు దుబాయ్ వెళ్ళి అక్కడే తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు.
 
ఈయన దబాయ్‌లో ఓ సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈయన చేసే పని... మార్చురీలో శవపరీక్షలు జరిగినపుడు (ముఖ్యంగా ప్రవాసుల మృతదేహాలకు) డాక్టర్లకు సాయపడటం, ఆ ప్రక్రియ పూర్తయ్యాక పార్థివదేహాన్ని మళ్లీ అన్ని రసాయనాలతో కలిపి పాడవకుండా బాగుచేసి ఓ రూపం తెచ్చి, బంధువులకు అప్పగించడం. అలా ఇప్పటివరకూ ఆయన 2500 మంది ప్రవాసీయుల మృతదేహాలకు చట్టపరంగా చేయవల్సిన ప్రక్రియలు పూర్తి చేసి వారి స్వస్థలాలకు పంపించారు. 
 
శ్రీదేవి కేసులో దుబాయ్ ప్రభుత్వ అధికారులతో వ్యవహరించడానికి భారత రాయబార కార్యాలయం ఆయనకు వకలా (పవర్‌ అఫ్‌ అటార్నీ వంటిది) ఇచ్చింది. దీంతో మార్చురీలోకి బోనీ కపూర్‌ తరపున ఆయన మేనల్లుడు సౌరభ్‌ మల్హోత్రాను అధికారులు అనుమతించారు. సౌరభ్ ఆయనకు శ్రీదేవి భౌతికకాయాన్ని చూపించాడు. అప్పటివరకు ఆయనకు శ్రీదేవి అంటే ఎవరో తెలియదట. పైగా, ఆమె నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకు చూడలేదట. 
 
శ్రీదేవి భౌతికకాయాన్ని సౌరభ్ చూపించిన తర్వాత ఆమెను గుర్తించినట్లు సంతకం పెట్టి, తన వీసా కాపీని మార్చురీ సిబ్బందికి ఇచ్చి ఇక అక్కడ నుంచి తాను చేయాల్సిన పనులు పూర్తి చేశాడు. అక్కడ నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని తిరిగి విమానాశ్రయంలో చేర్చే దాకా ఆయనే దాని వెంట ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాలలో ప్రవాసీయుల సేవలను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రవాసీ సమ్మాన్‌ ఆవార్డు గ్రహీత అయిన అష్రఫ్‌.. శ్రీదేవితో పాటు మరో నాలుగు మృతదేహాలను కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపించారు. శ్రీదేవి కేసు దర్యాప్తు, శవపరీక్ష అన్నీ చట్టప్రకారమే జరిగాయని అష్రఫ్‌ చెపుతున్నారు.