శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:26 IST)

శ్రీదేవి మృతిపై చెత్తవాగుడు ఇకనైనా ఆపండి : బాలీవుడ్ సెలబ్రిటీలు

నటి శ్రీదేవి మృతిపై గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. ఇకనైనా చెత్తవాగుడు ఆపాలంటూ మండిపడ్డారు.

నటి శ్రీదేవి మృతిపై గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. ఇకనైనా చెత్తవాగుడు ఆపాలంటూ మండిపడ్డారు. శ్రీదేవి కేవలం ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయారని దుబాయ్ పోలీసులు నిర్ధారించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని వారు సూచన చేశారు. 
 
శనివారం రాత్రి శ్రీదేవి మరణించారు. ఆ తర్వాత ఆమె మరణంపై వివిధ రకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా, గంటకో రకంగా మారిన శ్రీదేవి మృతి మిస్టరీని చివరికి ప్రమాదంగానే తేల్చేశారు. అయితే ఆమె భౌతికకాయం ముంబైకు రావడంపై జరిగిన జాప్యంతో ఆమె మృతిపై అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. గుండెపోటు, బాత్ టబ్‌లో ప్రమాదం, కాస్మోటిక్ సర్జరీలు, ఆస్తి గొడవలతో మనస్తాపం, ఆత్మహత్య, హత్య.. అంటూ అనేకరకాలుగా మూడు రోజుల నుంచి వార్తలు శ్రీదేవి మృతిపై వెలువడినాయి. కానీ ఆమె ప్రమాదవశాత్తూనే చనిపోయినట్లుగా ఫైనల్‌గా తేల్చేసి, బోనీకపూర్‌కి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. 
 
అయితే ఇప్పటివరకు ప్రచురితమైన కథనాల అనంతరం ఫైనల్ రిపోర్ట్ తెలిశాక.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు స్పందించడం మొదలెట్టారు. ఇకనైనా శ్రీదేవిపై లేనిపోని కథనాలు సృష్టించడం ఆపండని వేడుకుంటూ వారు ట్వీట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ, మీడియాకు.. సోషల్ మీడియా కంటెంట్ ప్రొవైడర్లకు ఇది నా వినయపూర్వకమైనమనవి. ఇంకా చాలా తప్పుడు కథనాలు వెలువడుతూ ఉన్నాయి. చనిపోయిన ఆమెపై గౌరవం చూపమని అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అలాగే, పలువురు సెలెబ్రిటీలు ఇదే విధంగా విజ్ఞప్తి చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.