గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (19:25 IST)

నేను ఆ మాట చెప్పగానే దాసరి మీసం మెలేశారు... చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు. శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు. ఐసీయులో వున్న దాసరి వద్దకు వ

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు. శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు. ఐసీయులో వున్న దాసరి వద్దకు వెళ్లి పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 
 
తను వెళ్లగానే దాసరి తన ఖైదీ నెం. 150 చిత్రం వసూళ్ల గురించి అడిగారనీ, ఆ మాటను పేపరుపై రాసి ఇచ్చారన్నారు. తను రూ. 150 కోట్లు వసూలు చేసిందని చెప్పగానే మీసం మెలేశారనీ, ఇంకా రూ.250 కోట్లు వసూలు చేయాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు. దాసరి చెప్పిన మాటలను నేను మర్చిపోలేనని అన్నారు. ఆయన ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారని, ఆయన వైద్యులు చేసే చికిత్సను మించి ఆత్మస్థైర్యం ఎక్కువనీ, తప్పకుండా త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో వస్తారని అన్నారు.