ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (17:04 IST)

రిహార్సల్‌లో గాయపడిన చియాన్ విక్రమ్

vikram
స్టార్ హీరో చియాన్ విక్రమ్ షూటింగులో గాయపడ్డారు. ఆయన పక్కటెముకకు గాయమైంది. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని నెలలుగా సాగుతోంది. నటుడు పశుపతి, నటి పార్వతి, మాళవిక మోహనన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
 
కోలార్ బంగారు గనిలో తమిళుల విషాద ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా స్పెషల్ మేకింగ్ వీడియోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే, గత వారం విడుదలైన 'పొన్నిస్ సెల్వన్-2'లో విక్రమ్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది.
 
ఈ సందర్భంలో, విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ మాట్లాడుతూ, నటుడు విక్రమ్ రిహార్సల్ సమయంలో అనుకోకుండా గాయపడ్డారని, పక్కటెముక విరిగిపోవడంతో కొంతకాలం తంగలాన్ షూటింగ్‌లో పాల్గొనలేరని చెప్పారు. అలాగే, పొన్నీస్ సెల్వన్ మరియు ఆదిత కరికాలన్‌లకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన ఆదరణ లభించినందుకు విక్రమ్ తన కృతజ్ఞతలను తెలిపినట్టు అతని మేనేజర్ ట్వీట్ చేశారు.