సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (08:32 IST)

పవన్‌కు పాట పాడిన మొగిలయ్య.. సీఎం కేసీఆర్ భారీ నజరానా

CM kcr
కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్యకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించి గౌరవించింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పద్మశ్రీ మొగిలయ్యకు భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాదు నగరంలో ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ.1 కోటి నగదు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.
 
పద్మశ్రీకి ఎంపికైన నేపథ్యంలో మొగిలయ్య ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు.
 
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌లో పాట పాడడంతో కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్య పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 మెట్ల కిన్నెర వీణపై ఆయన పలికించే సంగీతం జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకుంది.