సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (07:32 IST)

వీళ్లు డీజేనీ వదల్లేదు.. బిగ్ బాస్‌నూ వదల్లేదు.. వీళ్లబాధేంటో మరి

దువ్వాడ జగన్నాధంపై విడుదల కాకముందే నెగటివ్ వాతావరణాన్ని తీసుకువచ్చి దాన్ని ఎంత గబ్బులేపాలో అంత గబ్బు లేపారు బ్రాహ్మణ సంఘాలవారు. వేదమంత్రాల పవిత్రత పోయేలా పాటల్లో చమకాలను పెట్టి మన సంస్కృతికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీశారంటూ కోర్టుకు కూడా వెళ్లారు.

దువ్వాడ జగన్నాధంపై విడుదల కాకముందే నెగటివ్ వాతావరణాన్ని తీసుకువచ్చి దాన్ని ఎంత గబ్బులేపాలో అంత గబ్బు లేపారు బ్రాహ్మణ సంఘాలవారు. వేదమంత్రాల పవిత్రత పోయేలా పాటల్లో చమకాలను పెట్టి మన సంస్కృతికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీశారంటూ కోర్టుకు కూడా వెళ్లారు. విడుదల కూడా కానివ్వమంటూ తెగేసి చెప్పడంతో ఆ పాటను మార్చి మరీ విడుదల చేశారు. డీజేని అంతలా వణికించిన వారు ఇప్పుడు బిగ్‌బాస్‌పై పడ్డారు. 
 
ఒక ప్రముక తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణ సంఘాల బాధ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. హోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా.. అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు సరికాదని పేర్కొన్నారు. హిందూ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను వికృత ప్రదర్శనల కోసం ఎందుకు వాడుతున్నారంటూ వీరు నిలదీస్తున్నారు.
 
ఆయా సన్నివేశాలను తొలగించి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీకొండుమాకాంత్‌ శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ తదితరులు డిమాండ్‌ చేశారు. 
 
మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో కళా సృజనకు సంబంధించిన కృషిలో చేయిపెట్టడం, దాడి చేయడం తప్పే కావచ్చు కానీ బ్రాహ్మణ సంఘాల వారి ఆవేదనను కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో కదా..