శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 11 మార్చి 2017 (17:56 IST)

2 నెలల్లోనే 2 హేలీ తోకచుక్కలు చూపించారు... 'క‌త్రిన, క‌రీన‌, మ‌ద్య‌లో క‌మ‌ల్‌హ‌స‌న్' ద‌ర్శ‌కుడు ర‌త్న‌

తెలుగు సినిమాని ఉరితీయ‌కండి.. ఉరితీయ‌కండి ఇదే సెన్సారు స‌భ్యుల‌కి మా నినాదం అంటున్నారు క‌త్రినా క‌రీనా మ‌ధ్యలో క‌మ‌ల్‌హ‌స‌న్ చిత్ర ద‌ర్శ‌కుడు రత్న‌. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని క‌ష్ట‌ప‌డి చిత్రాన్ని కంప్లీట్ చేసి, ఫైన‌ల్

తెలుగు సినిమాని ఉరితీయ‌కండి.. ఉరితీయ‌కండి ఇదే సెన్సారు స‌భ్యుల‌కి మా నినాదం అంటున్నారు క‌త్రినా క‌రీనా మ‌ధ్యలో క‌మ‌ల్‌హ‌స‌న్ చిత్ర ద‌ర్శ‌కుడు రత్న‌. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని క‌ష్ట‌ప‌డి చిత్రాన్ని కంప్లీట్ చేసి, ఫైన‌ల్‌గా సెన్సార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి సెన్సారు వారి నిర్ణ‌యాల‌కి మాకు ప‌గ‌లే చ‌క్క‌లు క‌నిపించాయి. జ‌న‌ర‌ల్‌గా 75 ఏళ్ళ‌కు ఒక్క‌సారి హేలి తోక చుక్క క‌నిపిస్తే సెన్సారు వారు మాకు రెండు నెలల్లో రెండు హేలీ తోకచుక్కలు చూపించారు. 
 
అదేలాగంటే సెన్సారు షో పూర్త‌య్యాక మా సినిమాకు స‌ర్టిఫికేట్ రెఫ్యూజ్ చేస్తున్న‌ట్లు ఆఫీస‌ర్స్ చెప్పారు. ఎందుకు స‌ర్టిఫికేట్ ఇవ్వ‌లేక‌పోతున్నారని అంటే అంద‌రికి తెలిసిన కార‌ణ‌మే క‌దాని చెప్పి వెళ్ళిపోయారు. ఇంత‌లో ఒక మ‌హిళా స‌భ్యురాలు వ‌చ్చి అస‌లు న‌లుగురితో ఈ సినిమా చూడ‌టం ఎంత క‌ష్ట‌మైందో తెలుసా.. ఆ సీన్స్ ఏంటి.. ఆ క‌థ.. అస‌లు ఇలాంటి చిత్రాలు, ఆలోచ‌ల‌న‌లు ఎలా వ‌స్తాయండి మీకు అందామే. ఆమె పేరు మాకు తెలియ‌దు.. ఆమెకు నిజంగా అంత క‌ష్ట‌మైతే క్ష‌మించమ‌ని కోరుతున్నాము. 
 
ఇలా చేశారేంటి అనేది మా బాధ మాత్ర‌మే. ఆఫిస‌రు గారు నొక్కి మ‌రీ చెప్పారు అంద‌రికి తెలిసిన కార‌ణ‌మే అర్థం చేసుకో అన్నారు.. మాకు ఇప్ప‌టికీ అర్థం కాలేదు. రెండు రోజుల త‌రువాత పెద్ద హోమ్ వ‌ర్క్ చేసి రిఫ్యూజ్ అని పేజీలు పేజీలు లెట‌ర్స్ ఇచ్చారు. 
 
త‌రువాత రివైజింగ్ క‌మిటికి వెళ్ళాము. సెన్సారు ఛైర్మ‌న్‌, ఎనిమిదిమంది స‌భ్యులు వారికి వీలు క‌లిగిన‌ప్పుడు ప‌దిహేను రోజుల‌ త‌రువాత చూశారు. వారు కూడా సెన్సారు మాదిరిగానే రిఫ్యూజ్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అదేంటి అంటే మాకు ప్రెజ‌ర్ వుంది... అంతే అని చెప్పారు. 
 
కాన్స్‌ప్ట్ వ‌ల‌న రిఫ్యూజ్ ఇచ్చామ‌ని స‌ర్టిఫికేట్ ఇచ్చారు. మేము నిజంగా అంత దారుణంగా సినిమా తీసి వుంటే మా చిత్రాన్ని ప్రేక్ష‌కులే రిఫ్యూజ్ చేస్తారు. ఇప్ప‌డు మీరు ఇలా ఎందుకు చెయ్య‌టం అంటే ఎవ‌రి నోట మాట రాలేదు. ఈ ప‌రిణామం త‌రువాత చాలా ఇబ్బందులు ఎదుర్కొని ట్రెబ్యున‌ల్‌కి వెళ్ళాము. స‌బ్‌మిట్ త‌రువాత 60 రోజుల‌కి చిత్రాన్ని చూశారు. మ‌మ్మ‌ల్ని పిలిచి అస‌లు ఈ క‌థ తీసుకోవ‌టానికి కార‌ణాలు ఏంటి అని వివ‌రంగా అడిగారు. మేము చెప్పిన అన్ని విష‌యాలు సామ‌రస్యంగా విని విత్ అవుట్ క‌ట్స్ మాకు ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. 
 
1. ఈ సి వారు మాకు ఇచ్చిన రిపోర్ట్‌లో నైతిక విలువలు, స‌భ్య‌త‌, సంస్కారాల‌కు విరుద్ధంగా తీసిన చిత్ర‌మ‌ని..
 
 భార‌త‌దేశం అంతా అదే నైతిక విలువ‌లు, స‌భ్య‌త‌, సంస్కారాలు వుండ‌వా.. ట్రిబ్యున‌ల్ వారికి న‌చ్చిన చిత్రం వీరికి ఎందుకు న‌చ్చ‌లేదో మ‌రి.
 
2. ప్రేక్ష‌కుల్లో లైంగిక ఉత్సాహ‌న్ని క‌లిగించేలా, ఆడ‌వాళ్ళ‌ని కించ‌ప‌రిచేలా వుంద‌ని చెప్పారు.
 
మా చిత్రం చూస్తేనే ప్రేక్ష‌కుల్లో లైంగిక ఉత్సాహం క‌లుగుతుందా.. దేశంలో ఆడ‌వాళ్ళ‌ని కించ‌ప‌రిస్తే ట్రిబ్యున‌ల్ వారు ఎందుకు అంగీకరించారు.
 
3. మీ ఇళ్ళ‌ల్లో మీ మాన‌సిక ప‌రిస్థితి ప్ర‌కారం మా చిత్రాలు పనికి రావ‌ని చెప్ప‌టం ఎంత‌వ‌ర‌కూ న్యాయం.. అలాంటి నీతి మాలిన ప‌నులు చెయ్యాలంటే ల‌క్ష‌ల రూపాయిలు వ‌డ్డీల‌కి తీసుకురావ‌ల‌సిన ప‌రిస్థితి ఎందుకు..
 
4. సెన్సారు వారు చెప్పిన ప్ర‌కారం మేము ఎప్పుడు లైంగిక ఉత్సాహాన్ని కానీ, ఎవ‌రిని కించ‌ప‌రిచే విధంగా గాని ఈ చిత్రం తీయ‌లేదు. 
 
5. స‌మాజంలో చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న స‌మ‌స్య‌నే మేం చూపించాము. దాన్ని కామెడిగా చిత్రీకరించాము. 
 
6. రెండు గంట‌ల ఎమోష‌న్స్‌ని ఇంటి దాకా తీసుకెళ్ళే ప్రేక్ష‌కులు ఇప్పుడు లేరు. అలావుంటే ఈ మ‌ధ్యకాలంలో చాలా మంచి చిత్రాలు వ‌చ్చాయి క‌దా అంద‌రూ మంచిగా మారిపోవాలిగా.. మ‌హేష్‌ బాబు శ్రీమంతుడు చిత్రం చూసిన వారంతా ఊర్లు ద‌త్త‌త తీసుకునేవారు.. పేద‌వారే వుండేవారు కాదు.. ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ చిత్రం చూసిన వారంతా మొక్క‌లు నాటేయాలి క‌దా.. కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేసి ప్ర‌భుత్వాలు ఈ హ‌రిత‌హారాలు ఎందుకు నిర్వ‌హిస్తున్నాయి.
 
7. అస‌లు దేశ‌మంతా ఒకే చట్టం న‌డుస్తుంద‌న్న‌ప్పుడు ఎందుకు ఈ భేదాభిప్రాయాలు పాటించారో చెప్పాలి.
 
8. ట్రిబ్యున‌ల్‌లో పాస్ అయిన మా చిత్రాన్ని ఇలా ఎందుకు ఇక్క‌డివారు రిఫ్యూజ్ చేశారో చెప్పాలి. అంతేకాదు వారి క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటే మాలాంటి చాలామంది చిన్న చిత్రాల వారికి ఇలాంటి అన్యాయం జ‌ర‌గ‌దు.
 
9. తెలుగు చిత్రాన్ని ముఖ్యంగా చిన్న చిత్రాల్ని ఉరితీయ‌కండి.. న‌చ్చ‌క‌పోతే ప్రేక్ష‌కులు తిర‌స్క‌రిస్తారు. మీరే మీ స్వ‌లాభాల‌కోసం చేయ‌ద్దు.. రిఫ్యూజ్‌ల‌నే వ‌ర్డ్‌ని తీసివేయండి