చెక్ బౌన్స్ కేసు : రాధికా శరత్ కుమార్ దంపతులకు జైలుశిక్ష

Radhika Sarathkumar
Radhika Sarathkumar
ఠాగూర్| Last Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:46 IST)
చెక్కు బౌన్స్ కేసులో సినీ నటుడు శరత్ కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్ కుమార్‌లు చెన్నై సైదాపేట ప్రత్యేక కోర్టు రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు మాత్రం శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

బుధవారం వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్‌లు భాగస్వామ్యులుగా ఉన్న మ్యాజిక్ ప్రేమ్స్, రాడాన్ మీడియా గ్రూపుల తరపున రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి గత 2014లో రూ.2 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇందుకోసం సెక్యూరిటీగా ఏడు చెక్కులను అందజేశారు.

వీటిలో ఒక చెక్కు మాత్రం బౌన్స్ అయింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్థ ... శరత్ కుమార్ దంపతులతో పాటు.. వారి వ్యాపారభాగస్వామి స్టీఫెన్‌పై స్థానిక సైదాపేట ప్రత్యేక కోర్టులో కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. శరత్ కుమార్ దంపతులకు ఒక యేడాది జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు విధించిన శిక్షను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది.దీనిపై మరింత చదవండి :