గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (10:24 IST)

తమిళనాడుకు కమల్ కాబోయే ముఖ్యమంత్రి.. చెప్పిందెవరంటే?

ప్రస్తుతం తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఏంకే, అన్నాడీఎంకేలతో పాటు కమల్‌హాసన్ పోటీలో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే, అసలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు కాబోతారు? అనే దానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. రీసెంట్‌గా జరిగిన సర్వేలో తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తేలింది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని సీనియర్ నటి, సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అగ్రనేత రాధిక తెలిపారు. 
 
కమల్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ రాధిక చెప్పడం వెనుక బలమైన కారణమేంటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. రాధిక భర్త, నటుడు, ఎస్ఎంకే పార్టీ అధినేత శరత్ కుమార్.. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. తాము కూడా అదే ఆశిస్తున్నాం. ప్రజల్లో ఇంతలా ఏకగ్రీవంగా ఆలోచన రావడం గొప్ప విషయమని వెల్లడించారు. 
 
ఇదే సమయంలో మంచి పరిపాలన కోసం ఓటు వేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడమే కాకుండా మార్పు తీసుకొస్తామని తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు. భావితరాలకు కమల్‌హాసన్ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. అందుకు కమల్‌హాసన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని రాధిక తెలిపారు. మరి తమిళ ప్రజలు కమల్ హాసన్‌ను గెలిపిస్తారో లేదో వేచి చూడాలి.