గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-03-2021 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించినా...

మేషం : విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునరాలోచన మంచిది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. 
 
వృషభం : బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు అనుభవం గడిస్తారు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిజాయితీగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులు గట్టిపోటి ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
మిథునం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వ్యాపారాలలో బాగుగా రాణిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
సింహం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. కాలానుగుణంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరంగానూ, ఇతరాత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కన్య : సొంతంగా వ్యాపారాలు చేసినా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడిలకు గురవుతారు. కార్మికులకు తాపీ పనివారికి సంతృప్తికానరాదు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు తోటివారితో మితంగా వ్యవహరించడం క్షేమదాయకం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృశ్చికం : ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విదేశీవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. బ్యాంకింగ్ రంగాల్లోవారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మకరం : ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల్లోవారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. విద్యార్థులకు మానసిక ఆందోళన నిరుత్సాహం వంటితి అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనకతప్పదు. పాత వస్తువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.
 
కుంభం : రాబడికి మించిన ఖర్చులెదురైనా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. శాస్త్ర రంగాల వారికి పరిశోధనలు, ప్రయోగాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
మీనం : పోస్టల్, ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అధికమిస్తారు. ధనసహాయం చేసే విషంయలో అప్రమత్తత అవసరం. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. దైవదర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడటవల్ల మాటపడాల్సి వస్తుంది.