గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (12:08 IST)

కాంచీపురంలో సినీ నటుడు కమల్‌హాసన్‌ కారుపై దాడి..

మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ కారుపై  గుర్తుతెలియని యువకుడు దాడికి పాల్పడ్డాడు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి తర్వాత హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. 
 
ఈ దాడిలో కమల్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కమల్‌హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. 
 
కమల్ హాసన్ పార్టీలో హీరో మరో నటుడు విశ్వనటుడు శరత్ కుమార్‌తో పాటు మరికొన్ని పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి. అలాగే, అన్నాడీఎంకే, డీఎంకే కూటమిలు తలపడుతున్నాయి. కాగా, ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.