మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:56 IST)

ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.. ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్…?

బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ నారాయణ మరోసారి మండిపడ్డారు. అలాగే బిగ్ బాస్ హౌస్‌పై అలాగే హోస్ట్ నాగార్జునపై మండిపడ్డారు. నాగార్జున అంటే తనకు కోపం కాదని అసహ్యం అని అన్నారు. ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.. ఎవరితో డేటింగ్ చేస్తావ్.. ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్…ఇదేనా బిగ్ బాస్ అంటే అంటూ మండిపడ్డారు.
 
అంతే కాకుండా తాను ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు శాలువా కప్పారని అప్పుడు తాను దండం పెట్టగా ఆ ఫోటోలను తీసి ట్రోల్స్ చేశారని అన్నారు. కమ్యూనిస్టులు అంటే గడ్డం పెంచుకుని మాసిన బట్టలు.. చిరిగిన చెప్పులు ధరించి ఉండాలనుకుంటారని అది భ్రమ అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా సీఎం కేసీఆర్ గురించి తనకు తెలుసు అని తమ పార్టీవాళ్లకు తెలియాలని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని జగన్ చిన్న పిల్లవాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.