శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:25 IST)

ఒకటి నుంచి 4వ తరగతి గ్రేడర్ల కోసం మ్యాథ్స్- ఐజిబ్రా డాట్‌ ఏఐ

యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ (igebra.ai) నూతన తరపు వినూత్నమైన కార్యక్రమం మ్యాథ్‌++ను విడుదల చేసింది. ఇది మ్యాథ్స్‌ మరియు డాటా మరియు ఏఐ థింకింగ్‌ సమ్మేళనంగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ప్రపంచంలో  డిమాండ్‌ను విద్యార్థులు అందుకోగలరు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని భారతదేశంతో పాటుగా పలు దేశాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌ ధర 4999 రూపాయలు. దీనిని igebra.aiలో కొనుగోలు చేయవచ్చు.

 
ఏఐ మరియు డాటాలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన సోషల్‌ విజనరీలు రూపకల్పన చేసిన మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌లో మూడు కీలకాంశాలు భాగంగా ఉంటాయి. అవి మ్యాథ్‌,  రోబార్ట్‌ మరియు ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌.

 
ఐజిబ్రా డాట్‌ ఏఐ ఫౌండర్‌ అండ్‌ సీఈవో శ్రీని వేముల మాట్లాడుతూ, ‘‘సహజసిద్ధమైన అభ్యాస కార్యక్రమం మ్యాథ్‌++. నేటి డిజిటల్‌ ప్రపంచం కోసం అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతో తీర్చిదిద్దడం వల్ల ఇంటరాక్టివ్‌ మరియు శక్తివంతంగా మారుస్తుంది. విద్యార్థులు అత్యుత్తంగా నేర్చుకునేందుకు ఇది సహాయపడటంతో పాటుగా వినోదమూ అందిస్తుంది’’ అని అన్నారు.