మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 జులై 2022 (18:25 IST)

నా బాస్‌తో డాన్స్ నా ఫేట్ మార్చేసిందన్న యువన‌టి

Sultana, Varma
Sultana, Varma
అత‌ను నా బాస్‌. అంటూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టి రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో పుట్టిన‌రోజునాడు తెగ రెచ్చిపోయిన బామ ఇనయా సుల్తానా. ఏప్రిల్‌లో నెల‌లో వ‌ర్మ ఫుల్‌గా మందుకొట్టి ఆమెతో డాన్స్ చేసిన విష‌యం ఇంకా నెటిజ‌న్ల‌కు గుర్తుండే వుంటుంది. అంతే ప్రేమ‌గా ఆయ‌న‌తో కౌగిలించుకుని ముద్దాడిన న‌టి ఇనయా సుల్తానాకు వ‌ర్మ నుంచి ఆఫ‌ర్లు ఏమోకానీ ఆమె ఇంటిలోమాత్రం పెద్ద ర‌చ్చే జ‌రిగింది. మా ప‌రువు తీశావంటూ అమ్మ ఆవేద‌న చెందింది. ఈ విషయాన్ని ఇటీవ‌లే ఓ ఇంటర్వూలో చెబుతూ, వర్మతో డాన్స్ చేసినందుకు త‌న కుటుంబం తనను తీవ్రంగా ద్వేషిస్తున్నారని చెప్పింది.
 
Sultana, Varma
Sultana, Varma
సినిమాలో వేషాలు వ‌ద్దు అంటూ త‌న కుటుంబం చెప్పార‌నీ, కానీ నాకు న‌టికావాల‌న్న ఆస‌క్తితో హైద‌రాబాద్‌లోనే అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని చెప్పింది. త‌న తండ్రి చ‌నిపోవ‌డంతో తెలిసిన‌వారి ద్వారా అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో వ‌ర్మ ప‌రిచ‌యం అయ్యార‌ని చెప్పింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న పుట్టిన‌రోజునాడు పార్టీకి పిల‌వ‌డం అన్నీ వెంట‌నే జ‌రిగిపోయాయ‌ని పేర్కొంది.  ప్రస్తుతం ఇనయా సుల్తానా ఓ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది. దానికిముందుగా న‌ట‌ర్న‌తాలు అనే చిన్న సినిమాలో న‌టించింది.