మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 మే 2022 (19:38 IST)

ప్రేక్షకులకే అర్థంకాని వర్మకు మహేష్ బాబు మాటలు అర్థం కాలేదట...

Mahesh Babu
బాలీవుడ్ నన్ను భరించలేదని ఏదో యధాలాపంగా మాట్లాడిన ప్రిన్స్ మహేష్ బాబు మాటలను పట్టుకుని ఎవరికి తోచినట్లు వారు సాగదీస్తున్నారు. ఈ వ్యవహారంపై వర్మ కాస్త ఆలస్యంగా స్పందించారు.

 
మహేష్ బాబు ఒక నటుడిగా తన అభిప్రాయాలు తను చెప్పుకోవచ్చన్న వర్మ... అసలు మహేష్ మాటలు తనకు అర్థం కాలేదంటూ సెటైర్లు వేశాడు. అసలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఏవేవో పేర్లను మీడియా పెట్టింది తప్ప భారతదేశ సినిమా అనేది దేశం మొత్తానికి సంబంధించింది అంటూ చెప్పుకొచ్చారు.

 
ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత బోనీకపూర్ స్పందించారు. తను ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదనీ, అన్ని పరిశ్రమల్లో చిత్రాలు చేస్తున్నాను కనుక దీనిపై స్పందించలేనన్నారు. ఐతే మహేష్ బాబు ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందోనన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.