గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (21:10 IST)

బొమ్మకీ.. మనిషికి తేడా తెలియని వ్యక్తి ఆయన... జైరా స్పందనకు ఉలిక్కిపడిన కేంద్రమంత్రి

తనపై కేంద్ర మంత్రి విజయ్ గోయల్‌ చేసిన కామెంట్స్‌పై దంగల్ హీరోయిన జైరా వాసిమ్ ప్రతిస్పందించారు. బొమ్మకీ.. మనిషికి తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేసింది.

తనపై కేంద్ర మంత్రి విజయ్ గోయల్‌ చేసిన కామెంట్స్‌పై దంగల్ హీరోయిన జైరా వాసిమ్ ప్రతిస్పందించారు. బొమ్మకీ.. మనిషికి తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేసింది. 
 
పంజరంలో బందీగా ఉన్న ముస్లిం యువతి నగ్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. జైరా(దంగల్ హీరోయిన్) పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలా ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 
 
దీనికి జైరా కూడా ఘాటైన ట్వీట్ చేశారు. ఆ బొమ్మకీ, తనకీ ఉన్న సారూప్యత ఏమిటో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. బురఖా ధరించిన ముస్లిం మహిళలు అందంగానే కాదు, స్వేచ్ఛగా కూడా ఉంటారనే విషయం మంత్రికి తెలియజేయాలనుకుంటున్నానంటూ ఘాటుగా బదులిచ్చింది.