సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (15:51 IST)

హీరోయిన్ ఛాన్స్ రావాలంటే వాళ్లు పడక సుఖం తీర్చాల్సిందే: దంగల్ బ్యూటీ ఫాతిమా సంచలనం

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే వుంది. తాజాగా మరోసారి దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
 
సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే ఇక్కడివారికి లైంగిక సుఖం ఇవ్వక తప్పదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. లైంగిక వాంఛ తీర్చితేనే ఛాన్సులు వస్తాయనీ, కాదంటే కోల్పోతామని వెల్లడించింది. అలా తను కోల్పోయిన అవకాశాలు వున్నాయని చెప్పింది.
 
కొందరు క్యాస్టింగ్ కౌచ్ వుందంటారు మరికొందరు లేదంటారు. కానీ నా అనుభవం ప్రకారం ఆఫర్ కావాలంటే సెక్సువల్ ఫేవర్ కంపల్సరీ. అది లేకుండా ఛాన్స్ దక్కించుకోవడం కష్టం అని చెప్పింది. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు... మిగిలిన చాలా ఇండస్ట్రీల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్య అని వెల్లడించింది.