అచ్చెన్నా.. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే డిసైడై వుంటావు, ఎద్దంత మనిషివి..: విజయసాయి రెడ్డి సెటైర్లు
వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి మరోసారి తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై సెటైర్లు విసిరారు. ఆయన మాటల్లోనే... ''అచ్చెన్నా, ఆ తండ్రీకొడుకుల మెప్పు కోసం ఎంత గులాంగిరి చేసినా ఎన్నటికీ హోం మంత్రి కాలేవని నీకూ తెలుసు. ఎందుకు సొల్లు స్టేట్ మెంట్లు. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే డిసైడై ఉంటావు. ఆ పార్టీ వారిని ప్రసన్నం చేసుకునే కిటుకులు ట్రై చేయి. మీ బాస్ లాగా!
ఉన్న మాటే అన్నావ్. బొక్కలో పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అని చిటికెలు వేసేయ్. మధ్యలో లోకేశ్ చంకలో దూరడం ఎందుకు. ఎద్దంత మనిషివి భయపడితే ఎలా అచ్చెన్నా. కొమ్ములతో కుమ్ముకుంటూ ముందుకు దూసుకుపో. ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది. అప్పుడు నీ హోం మంత్రి కల నెరవేర్చుకో.''