బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:02 IST)

సిఎంకు తెలిసే ఎపిలో మతమార్పిడులు జరుగుతున్నాయి: సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు

మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ దేవదర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఎపిలో అన్యమతప్రచారం, మతమార్పిడులు జరుగుతున్నాయన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎపిలో అధికసంఖ్యలో హిందువులు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారన్నారు. 
 
హోంమంత్రి సుచరిత క్రిస్టియన్ అని, అలాగే తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థి గురుమూర్తి కూడా క్రిస్టియన్ అంటూ ఆరోపించారు. కొంతమంది హిందూ దేవతలను సైతాన్లుగా మాట్లాడటం బాధిస్తోందన్నారు. చర్చి ఫాస్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.
 
ఫాస్టర్లు బలవంతంగా హిందువులను మతమార్పిడులను చేయిస్తున్నారని.. మతం మార్చేందుకు ఫాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మతం మార్చడాన్ని బిజెపి ఎప్పటికీ వ్యతిరేకిస్తుందన్నారు సునీల్ దేవదర్. ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువైంది.