గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (14:52 IST)

టీడీపీకి కొత్త నాయకత్వం .. ఎన్టీఆర్ రావాలి : గోరంట్ల బుచ్చయ్య

తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం రావాలని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఆ కొత్త నాయకత్వ బాధ్యతలను సినీ హీరో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. 
 
సోమవారం రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గోరంట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్  విగ్రహానికి నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్  స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పారు.
 
గ్రౌండ్ రియాల్టీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని స్పష్టంచేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం  పనిచేయాలని చెప్పారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.