శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (13:31 IST)

టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్ రిపీట్!

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో "ఆర్ఆర్ఆర్" చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మరో హీరోగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి - ఎన్టీఆర్ కాంబోలో మరో చిత్రం రానుందనే టాక్ వినిపిస్తోంది. 
 
గతంలో వీరిద్దరి కాంబోలో 'స్టూడెంట్ నెం:1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి, ఎన్టీఆర్ "ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమాను పూర్తి చేసిన తరువాత... త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ జతకట్టనున్న సంగతి తెలిసిందే. 
 
ఆ తర్వాత ప్రశాంత్ నీల్, అట్లీతో రెండు ప్రాజెక్టులు చేయనున్నారు. మొదట ఎవరి సినిమాలో నటిస్తాడో తెలియదు. మరోవైపు "ఆర్‌ఆర్‌ఆర్" తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా తీయనున్నారు. 
 
మహేష్ సినిమా పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా టైం పట్టొచ్చు. కానీ ఇది తారక్ అభిమానులకు నిజంగా ఓ సంతోకరమైన న్యూస్.