గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (12:12 IST)

ఎన్టీఆర్.."సీఎం, సీఎం" అంటూ అరుపులు.. ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా..?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఇది సమయం కాదని చెప్పినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని సీఎం చేయాలని కలలు కంటున్నారు. తాజాగా 'తెల్లవారితే గురువారం' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ హాజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతుండగా "సీఎం, సీఎం" అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఉత్సాహం వెలిబుచ్చారు. తారక్ ఓవైపు కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ గురించి మాట్లాడుతుండగా, అభిమానులు మాత్రం సీఎం నినాదాలతో హోరెత్తించారు. 
 
కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఎన్టీఆర్‌ను కాస్తంత అసహనానికి గురిచేసింది. ఆయన వెంటనే ప్రసంగం ఆపి... "ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా" అంటూ మందలించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు తారక్. దాంతో అభిమానులు కూడా ఆయన మాట విన్నారు. అప్పటి వరకు అరిచినా వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
 
ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ మా అబ్బాయిలు అభయ్, భార్గవ్‌ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం గురించి అలానే ఉంటానని చెప్పుకొచ్చారు. 
 
వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమోనని అన్నారు. నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదేనని అన్నారు. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 27న విడుదల కానుంది.