మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (18:24 IST)

తాగుడు వ్యసనం కాదు.. మా సంప్రదాయం : నాని 'దసరా' టీజర్ రిలీజ్

dasara team
నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "దసరా". ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. నిర్మాత చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. 
 
గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ. ఇందులో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రధానమైన పాత్రలను మాత్రమే కవర్ చేస్తూ ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, పూర్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. మార్చి 30వ తేదీన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.