దాసరి నారాయణ రావు మా బంధువు.. వ్యక్తిగతంగా తీరని లోటు : పవన్ కళ్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుబిడ్డ, దర్శకరత్న దాసరి నారాయణరావు తమకు బంధువు అవుతారని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంకా తీరని లోటని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం కన్నుమూసిన దాసరి భౌతి
తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుబిడ్డ, దర్శకరత్న దాసరి నారాయణరావు తమకు బంధువు అవుతారని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంకా తీరని లోటని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం కన్నుమూసిన దాసరి భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. దాసరి నివాసానికి వెళ్లిన ఆయన... దాసరి భౌతికకాయం వద్ద పూలమాల ఉంచి నమస్కరించారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిలు కూడా వచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... దాసరి మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశానని... ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించానని చెప్పారు. తన చిన్నతనం నుంచి దాసరి తనకు బాగా పరిచయమని... బంధువు కూడా అని తెలిపారు. దాసరి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామన్నారు.
ఇకపోతే.... దాసరి నారాయణరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నిర్మాత, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక మహా దర్శకుడు, నిర్మాత, నటుడు అని కీర్తించారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగానికి కూడా పేరు తీసుకువచ్చిన గొప్ప మనిషి అని అన్నారు. దాసరిలాంటి మరో వ్యక్తిని భవిష్యత్తులో మనం చూడలేమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.