గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (15:56 IST)

కరోనా వైరస్‌తో మానసిక ఒత్తిడి వల్లే ప్రాణాపాయం: హీరో నాగచైతన్య

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సందర్భంలో కరోనా సోకినవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా లక్షణాలున్నా బయట చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తమకు కోవిడ్ 19 పాజిటివ్ వుందని తెలియగానే భయపడిపోతున్నారు. దాంతో ఒత్తిడి అధికమై అధి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది.
 
తాజాగా సినీ హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భయంతో చాలామంది తమకు కరోనా ఉన్న విషయాన్ని దాచి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వైరస్ పైన  ప్రతి ఒక్కరూ భయాన్ని వీడాలని నాగచైతన్య పిలుపునిచ్చారు. కరోనా సోకి కోలుకున్నాక ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలన్నారు.
 
అలాగే కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చెయ్యాలన్నారు. అది చాలామంది ప్రాణాలను కాపాడుతుందని, అలాంటి సేవలో మీ పాత్ర  కీలకమైనదని తెలిపారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపరాదని, అందరూ కలిసి పోరాడి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు.