శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (13:55 IST)

ప్రపంచ వ్యాప్తంగా కోటి 48లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి 48 లక్షలు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

ఇంకా బ్రెజిల్‌లో 80వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
అమెరికాలో ఇప్పటి వరకు 39,61,429 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,43,834 మంది మృతి చెందారు. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,49,989 మంది కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,48,55,107 పాజిటీవ్ కేసులు నమోదైయ్యాయి. 6,13,248 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 89,07,167 మంది కోలుకున్నారు.