శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (09:45 IST)

కరోనా విలయతాండవం: బ్రెజిల్‌ను భారత్ దాటేస్తుందా?

భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా 24 గంటల్లో 37,148 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 40 వేలకు పైగా కేసులొచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1155191కి పెరిగింది. గత 24గంటల్లో 587 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 28084కి చేరింది. 
 
ప్రస్తుతం భారత్‌లో మరణాల రేటు 2.4 శాతంగా ఉంది. అంటే ప్రతి 1000 మంది కరోనా సోకిన వారిలో... 24 మంది చనిపోతున్నారు. ఇక... గత 24 గంటల్లో 24491 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 724577కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 402529గా ఉంది. రికవరీ రేటు 62.7 శాతంగా ఉన్నా.... రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం విచారకరం. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో భారత్ టాప్-3లో ఉండగా... రోజువారీ కేసుల్లో టాప్-2లో ఉంది. మొత్తం మరణాల్లో భారత్ టాప్ 8లో ఉండగా... రోజువారీ మరణాల్లో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో వుంది. ఇదివరకు మొదటిస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మూడోస్థానానికి చేరింది. కానీ భారత్‌లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది కాబట్టి... త్వరలోనే బ్రెజిల్‌ని దాటి టాప్‌లో నిలిచే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి