సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (12:36 IST)

డాకు మహారాజ్ సీక్వెల్ తీస్తా : డైరెక్టర్ బాబీ

Balayya- daku
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. విడుదలకు ముందు ఏ స్థాయిలో జోరు కనిపించిందో ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద 'డాకు' జోరు నడుస్తోంది. దీంతో చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలైంది. 
 
సినిమా మంచి టాక్ దక్కించుకోవడంతో మూవీ టీమ్ ఆదివారం ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఈ సినిమాకు ప్రీక్వెల్ ఏమైనా ఉండబోతుందా? అన్న ప్రశ్న మీడియా నుంచి నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఎదురైంది. దీనికి నాగవంశీ రిప్లై ఇస్తూ.. ప్రీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నామన్నారు.
 
సినిమాలో ఓ విగ్రహం తల లేకుండా కనిపిస్తుందని, ఇదే పాయింట్‌ను హీరోగా చేసి 'డాకు మహారాజ్' ప్రీక్వెల్'గా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ప్రీక్వెల్ బాలకృష్ణతోనే ఉండబోతుందా? లేక వేరే యాక్టర్ ఎవరైనా కనిపిస్తాదా? అనేది హాట్ టాపిక్‌గా ఉంది.