సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (11:48 IST)

దర్శకరత్న దాసరికి తీవ్ర అస్వస్థత : ఐసీయూలో అడ్మిట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి ఆయన గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాగా, ఆయన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనకు ఓ చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉండగా, అస్వస్థతకు గురైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. 
 
కొంతకాలం క్రితం దాసరికి బైపాస్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ, అనారోగ్యం ఆయన్ని ఇబ్బందిపెడుతూనే ఉంది. దాసరి ఆరోగ్యపరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇంకా స్పందించలేదు. 
 
కానీ, దాసరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన మేనేజర్ స్పందించారు. ప్రతి యేడాది చలికాలంలో దాసరికి ఆరోగ్య రెగ్యులర్‌గా చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ చెకప్‌లలో భాగంగానే ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.