గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 24 మే 2021 (16:23 IST)

`జెట్టి` క‌థ విని ఉద్వేగానికి లోన‌యిన ద‌ర్శ‌కుడు

song release venu
వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాతగా సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియాలో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ, నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక. ఈమూవీ ఆల్బ‌మ్లోని మొద‌టి సాంగ్ని సంగీత ద‌ర్శ‌కుడు కార్తిక్ కొండ‌కండ్ల స్టూడియోలో లాంఛ్ చేశారు `విరాట ప‌ర్వం` ద‌ర్శ‌కుడు వేణ ఉడుగుల‌. సినిమా క‌థ‌ను తెల‌సుకొని ఆయ‌న చాలా ఉద్వేగానికి లోను అయ్యారు. 
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, జెట్టి సినిమాలోని దూరం క‌రిగినా పాట లాంఛ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. శ్రీమ‌ణి రాసిన ఈ పాట సాహిత్య‌పు విలువ‌ల‌తో ఉంది. కొన్ని షాట‌ల్ని చూసాను చాలా బాగున్నాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాత వేణు మాధ‌వ్ గారికి, మ్యూజ‌క్ డైరెక్ట‌ర్ కార్తిక్ కి, ద‌ర్శ‌కుడు సుబ్ర‌మ‌ణ్యం పిచ్చుకకు నా శుభాకాంక్ష‌లు. ఇది జీవితాల్లోంచి పుట్టిన క‌థ‌. మ‌త్స‌కారుల జీవితాల్లోని క‌న్నీటి అల‌లు, స‌మ‌స్య‌ల సుడిగుండాలని విశ‌దీక‌రించే అద్భుత‌మైన క‌థా వ‌స్తువు తీసుకొని జెట్టి అనే సినిమాని నిర్మించారు. ఇప్పుడే క‌థ విన్నాను. సినిమా విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. నిర్మాతకి రెట్టింపు లాభాలు రావాల‌ని ఆశిస్తున్నాను. అన్నారు.
 
మ్యూజిక్ ద‌ర్శ‌కుడు కార్తిక్ కొండకండ్ల మాట్లాడుతూ, వేణు గారు తీసుకునే క‌థ‌లు సందేశాత్మ‌కంగా సాగుతాయి. జెట్టి సినిమా క‌థ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీమ‌ణి గారు రాసిన దూరం క‌రిగినా.. మౌనం కరుగునా.. పాట సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఈ మోలోడీ త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమాలో వ‌చ్చే మొద‌టి పాట ఇది. పాట‌ల విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌త్యేక శ్ర‌ర్ధ తీసుకున్నారు. నాలుగు బాష‌ల్లో విడుద‌ల‌వుతున్న జెట్టి లో అన్ని పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. జెట్టి త‌ప్ప‌కుండా మంచి మ్యూజిక్ అల్బ‌మ్ అవుతుంది. అన్నారు.
 
ద‌ర్శ‌కుడు సుబ్ర‌మ‌ణ్యం పిచ్చుకు మాట్లాడుతూ, వేణు గారు మా  ఆల్బ‌మ్ లో  మొద‌టి పాట విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చూప‌ని క‌థ‌. సంగీతం విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఆల్బ‌మ్ అన్ని సాంగ్స్ ఆక‌ట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్ గారికి ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు. దూరం క‌రిగినా .. మౌనం క‌రుగునా పాట తో జెట్టి మ్యూజ‌క‌ల్ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది.  సూప‌ర్ హిట్ అల్బ‌మ్ ని అందించ‌బోతున్నాం అనే న‌మ్మ‌కం మా టీం అంద‌రికీ ఉంది. అన్నారు.