గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (20:42 IST)

'ఆర్ఎక్స్ 100' బ్యూటీపై "బంగార్రాజు" కన్ను! (video)

గతంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రం సీక్వెల్‌గా బంగార్రాజు చిత్రం రానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. 
 
అయితే, ఇందులో ఓ ఐటెం సాంగ్ ఉందట. దీనిని 'ఆరెక్స్100' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌తో చేయించాలనుకుంటున్నారట. ఈ సినిమా వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందట. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా మంచి మాస్ సాంగ్ కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. 
 
విలేజ్‌లో ఈ సాంగ్ తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. పాయల్ అయితే ఈ సాంగ్‌కి కరెక్ట్‌గా సూటవుతుందనే ఆలోచనలో ఉన్నట్టు వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రావాలంటే చిత్ర బృందం వెల్లడించే వరకు ఆగాల్సిందే.