గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

వెనక్కి తగ్గని శంకర్ : బాలీవుడ్ "అపరిచితుడు"లో హీరోయిన్ ఫిక్స్

సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ తాను 15 యేళ్ల క్రితం నిర్మించి అపరిచితుడు చిత్రాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా హిందీలో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ చిత్రం హీరో. అయితే, ఈ చిత్రానికి తమిళ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలిమ్స్ అధినేత వి.రవిచంద్రన్ అడ్డు తగిలారు. ఈ చిత్ర కథ తనదని వాదించారు. అయితే, దీనికి శంకర్ ధీటుగా సమాధానమిచ్చారు. 
 
నిజానికి 16 యేళ్ల క్రితం తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ రీమేక్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌తో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాకు క‌థ‌కు సంబంధించి లీగ‌ల్ నోటీసులు అందుకున్నా, త‌గ్గేదేలేదు అంటున్నాడు. 
 
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని క‌థానాయిక‌గా ఎంపిక చేశార‌ని త్వ‌ర‌లోనే ఆమెపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్ని వివాదాలు ఉన్నా కూడా శంక‌ర్ త‌న ప‌ని తాను చేసుకుపోతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.
 
ఇదిలావుంటే, ఇటీవ‌లికాలంలో స‌రైన హిట్స్ లేక డిప్రెషన్‌లో ఉన్న శంక‌ర్ మంచి హిట్ కొట్టి మ‌ళ్లీ పాత ఫాంను అందుకోవాల‌ని అనుకుంటున్నాడు. ఇటీవ‌లే "భారత‌యుడు 2" చిత్ర షూటింగ్ మొద‌లు పెట్టి మ‌ధ్య‌లో ఆపేశాడు. ఇక రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి డీటైల్స్ వెల్ల‌డించ‌నున్నారు. ఇపుడు హిందీ అపరిచితుడును తెరకెక్కిచనున్నారు.