గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (22:17 IST)

శంకర్... ఆ రోజు నీవో ఫ్లాప్ డైరెక్టర్‌వి, అపరిచితుడితో హిట్ ఇచ్చా, నాకే చెప్పకుండా రీమేక్ చేస్తావా?

హిట్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారంపై నిర్మాత రవిచంద్రన్ ఫైర్ అయ్యారు. బోయ్స్ చిత్రంతో భారీ ఫ్లాప్ మూటగట్టుకుని తీవ్రమైన ఒత్తిడిలో వున్నప్పుడు శంకర్‌ని పిలిచి అన్నియన్- తెలుగులో అపరిచితుడు చిత్రాన్ని నిర్మించాననీ, అలా శంకర్ హిట్ డైరెక్టర్ అయ్యాడంటూ చెప్పుకొచ్చారు.
 
అలాంటిది నాకు చెప్పకుండా నేను నిర్మించిన చిత్రాన్ని హిందీలో ఎలా రీమేక్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని మార్చుకో అంటూ హెచ్చరించారు. ఐతే దీనిపై శంకర్ కూడా స్పందించారు. అన్నియన్ చిత్ర కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నా పేరుతోనే చిత్రం విడుదలైంది.
 
పైగా ఈ కథ మీకు సొంతం అని నేను ఎలాంటి పత్రాన్ని మీకు ఇవ్వలేదు. కాబట్టి ఇది కావాలనే చేస్తున్న రాద్దాంతం తప్ప మరొకటి కాదంటూ శంకర్ పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి.