మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (12:41 IST)

'సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' ఎవరు?

దర్శకుడు వంశీ.. పెద్ద వంశీగా ప్రసిద్ది. తక్కువ బడ్జెట్‌తో ఆహ్లాదకరమైన కథలను తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయన సొంతం. ఇక ఆయన సినిమాల్లోని పాటలు ఆనందాన్నీ.. ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి.

దర్శకుడు వంశీ.. పెద్ద వంశీగా ప్రసిద్ది. తక్కువ బడ్జెట్‌తో ఆహ్లాదకరమైన కథలను తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయన సొంతం. ఇక ఆయన సినిమాల్లోని పాటలు ఆనందాన్నీ.. ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో 'లేడీస్‌ టైలర్‌'కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాకి ఆయన సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు. 
 
'ఫ్యాషన్‌ డిజైనర్‌'.. సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌- అనే ఉపశీర్షికతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా చేయనున్నాడనే వార్త కూడా వినిపించింది. రాజ్‌ తరుణ్‌ కూడా తాను ఈ సినిమా చేయనున్నట్టుగా కొంతకాలం క్రితం చెప్పాడు. 
 
అయితే వంశీ ఇప్పుడు ఈ సినిమాను రాజ్‌ తరుణ్‌తో కాకుండా, కొత్త నటీనటులతో ప్లాన్‌ చేస్తున్నాడనే వార్త షికారు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడని చెబుతున్నారు.